AP: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది దురదృష్టకరమైన ఘటన అని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్లు కాకుండా.. ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలన్నారు. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలను కాపాడేందుకు పోరాటం చేస్తున్నారని పవన్ తెలిపారు.