AP: సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పై దాడి ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సంచలన ఆరోపణలు చేశారు. ఆ సమయంలో వైసీపీ వాళ్లు దారి కాపు కాశారని ఆయన వ్యాఖ్యానించారు. పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ కావాలనే రాజకీయం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకే విమర్శలు చేశారని థూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు.