AP: అనంతపురం జిల్లా శింగనమలలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీకి చెందిన రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అవినీతి గురించి టీడీపీ నేత కనుంపల్లి ప్రసాద్ పార్టీ అధిష్టానికి ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహానికి లోనయ్యారు. మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ కనుంపల్లి ప్రసాద్, అతని వర్గీయులపై దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.