కేరళలో విషాదం చోటుచేసుకుంది. కొట్టాయంలో అయ్యప్ప స్వాములతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో 30 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ స్వాములంతా హైదరాబాద్, మాదన్నపేట్, ఉప్పర్‌గూడ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు.