చీటింగ్ చేయడంలో చంద్రబాబు PHD చేశారని వైఎస్ జగన్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తాను ఇచ్చిన హామీలు ఎగ్గొట్టేందుకు డ్రామాలాడుతున్నారు. పరిస్థితి తలుచుకుంటే భయం వేస్తుందంటారు. రాష్ట్రం ధ్వంసమైపోయిందని అంటారు. నటనలో బాబుకు అవార్డు ఇస్తే బాగుంటుంది.. ఆ స్థాయిలో నటిస్తారాయన. ‘బాబును నమ్మడం అంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే’ అని ఎన్నికల టైంలో చెప్పా. అయినా ప్రజలు పొరపాటు పడ్డారు’’ అని జగన్ అన్నారు.