ఏపీలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు జాతీయ రహదారిపై బైక్‌ను లారీ ఢీకొట్టింది. బైక్‌ను కొద్ది దూరం వరకు లారీ ఈడ్చుకెళ్లింది. ఇద్దరు బీటెక్ సెకండియర్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. విద్యార్థుల శరీర భాగాలు చెల్లాచెదురయ్యాయి. మృతులు ప్రవీణ్ కుమార్ (20), చింతా కార్తీక్ (19)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.