ఏపీ వ్యాప్తంగా మద్యం షాపులు మూతపడ్డాయి. సోమవారంతో వైన్ షాపుల్లో కాంట్రాక్టు ఉద్యోగుల కాలం ముగిసింది. అయితే మరో 10 రోజులు వైన్ షాపులు తెరవాలని ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను కోరింది. కానీ తర్వాత తమ ఉద్యోగాలు ఉండవని, ప్రైవేట్ వైన్ షాపులు వస్తాయని ఇవాళ్టి నుంచే సిబ్బంది విధుల్లోకి రాలేదు. దీంతో 3,240 వైన్ షాపులు మూతబడ్డాయి.