స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. అన్ని కాలపరిమితుల డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్లను తగ్గించింది. శుక్రవారం నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. దీంతో 444 రోజుల డిపాజిట్లపై 7.05 శాతంగా ఉన్న వడ్డీ రేటు 6.85 శాతానికి చేరింది. మిగతా అన్ని డిపాజిట్లపైనా 0.20 శాతం వడ్డీ తగ్గనుంది. దీంతో FD చేసుకున్న కస్టమర్లకు నష్టం చేకూరుతుంది.