Bajaj Auto: త్వరలో మార్కెట్లోకి ఎలక్ట్రిక్ రిక్షా

79చూసినవారు
Bajaj Auto: త్వరలో మార్కెట్లోకి ఎలక్ట్రిక్ రిక్షా
బజాజ్ ఆటో మార్చి చివరి నాటికి ఈ-రిక్షా విభాగంలోకి ప్రవేశిస్తోంది. నెలకి 45,000 యూనిట్ల పరిమాణం గల ఈ మార్కెట్ ప్రస్తుతం అత్యంత అవ్యవస్థీక‌ృతంగా ఉందని, మార్చి త్రైమాసికం ముగిసేలోగా నియంత్రణాపరమైన అనుమతులు తీసుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ తెలిపారు. అనుమతులు రాగానే ‘ఈ-రిక్’ మోడల్ విడుదల చేయాలని భావిస్తున్నామన్నారు. ఏప్రిల్ తొలివారం నుంచి అమ్మకాలు ప్రారంభించనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్