వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్‌కు పంపినట్లు తెలిపారు. అయితే గత కొద్ది రోజుల నుంచి బాలినేని వైసీపీ పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి ఆయన రాజీనామా చేశారు. రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో బాలినేని భేటీ కానున్నారు. జనసేనలో చేరికపై పవన్ కళ్యాణ్‌తో చర్చించనున్నారు.