26 కేజీల బంగారంతో బ్యాంక్‌ మేనేజర్‌ పరార్‌!

65చూసినవారు
26 కేజీల బంగారంతో బ్యాంక్‌ మేనేజర్‌ పరార్‌!
కేరళలో ఓ బ్యాంకు మేనేజర్‌ ఖాతాదారులు తనఖా పెట్టిన 26 కేజీల బంగారంతో ఉడాయించాడు. తమిళనాడుకు చెందిన మధు జయకుమార్‌.. కోలికోడ్‌ జిల్లా ఇడోడిలోని ఓ ప్రభుత్వరంగ సంస్థ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేశాడు. ఇటీవల అతడు కొచ్చికి బదిలీ అయ్యాడు. ఈ క్రమంలో నిర్వహించిన సాధారణ ఆడిట్‌లో భారీ స్థాయిలో దాదాపు 26 కేజీల బంగారం మాయమైనట్లు వెల్లడైంది. కేసు నమోదు చేసుకొని అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్