అద్దంకిలో 99. 26 శాతం పెన్షన్లు పంపిణీ

81చూసినవారు
అద్దంకిలో 99. 26 శాతం పెన్షన్లు పంపిణీ
అద్దంకి మండలంలో శుక్రవారం 99. 26 శాతం పెన్షన్ల పంపిణీ ప్రక్రియ జరిగినట్లు ఎంపీడీవో సత్యనారాయణ శనివారం తెలియజేశారు. తమ సిబ్బంది రెండవ రోజు కూడా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేసినట్లు చెప్పారు. మొదటిరోజు ఊర్లలో ఉన్న వారికి పూర్తిస్థాయిలో పంపిణీ చేసినట్లు చెప్పారు. ఊర్లు నుండి వచ్చిన వారికి పంపిణీ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నట్లు ఎంపీడీవో సత్యనారాయణ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్