బాపట్లలో పటిష్ట నిఘా ఏర్పాటు

84చూసినవారు
బాపట్లలో పటిష్ట నిఘా ఏర్పాటు
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పట్టణంలో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం బాపట్ల పట్టణంలో పోలీసులు ఆధ్వర్యంలో నిరంతర వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే ప్రజలు వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలన్నారు. కౌంటింగ్ నేపథ్యంలో 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. ప్రజలు ఎటువంటి అల్లర్లకు పాల్పడవద్దన్నారు.

సంబంధిత పోస్ట్