స్కూల్ బాత్రూంలోని టైల్స్ తగిలి విద్యార్థికి గాయాలు

64చూసినవారు
స్కూల్ బాత్రూంలోని టైల్స్ తగిలి విద్యార్థికి గాయాలు
బుధవారం బాపట్ల పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి స్కూల్ బాత్రూంలోకి వెళ్లగా, బాత్రూంలో విరిగి ఉన్న టైల్స్ విద్యార్థి చేతికి ప్రమాదవశాత్తు తగలడంతో చేతికి బలమైన గాయం తగిలింది. దీంతో పాఠశాల సిబ్బంది విద్యార్థిని దగ్గరలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. చేతికి కుట్లు పడ్డాయని తెలిపారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ కూడా సరైన సౌకర్యాలు లేవని తల్లిదండ్రులు వాపోయారు.

సంబంధిత పోస్ట్