బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో బుధవారం కమిషనర్ రఘునాథరెడ్డి యానిమల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో ఉన్న వీధి కుక్కల సంతానోత్పత్తి నిరోధించే చర్యలపై సమీక్ష నిర్వహించారు. రాజీవగాంధీ కాలనీ లో ఏర్పాటు చేసిన వీధి కుక్కల సంతానోత్పత్తి నియంత్రణ చికిత్సాలయoలో 2, 3రోజుల్లో కార్యక్రమం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ఆదేశించారు. డిఈ కృష్ణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.