బాపట్లలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం

82చూసినవారు
బాపట్లలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం
బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం అన్నం సతీష్ కళ్యాణమండపంలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా పట్టణంలోని పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బాపట్ల ఎంపీ , ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయుల సేవలను వారు కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్