చిలకలూరిపేట: ఘనంగా ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

57చూసినవారు
చిలకలూరిపేట: ఘనంగా ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కార్మికుల, కర్షకుల సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నది ఏఐటీయూసీ అని ఏఐటీయూసీ చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షులు పేలూరి రామారావు అన్నారు. గురువారం చిలకలూరిపేట సిపిఐ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ 105వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఏఐటీయూసీ జెండాను సిపిఐ ఇన్చార్జి కార్యదర్శి కామ్రేడ్ నాగభైరు రామసుబ్బాయమ్మ ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్