రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీలలో చీరాలకు పతకాల పంట

81చూసినవారు
రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీలలో చీరాలకు పతకాల పంట
చీరాలలో రేపల్లె భోగి ధర్మ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ పోటీలలో చీరాల విద్యార్థులు సత్తా చాటారు. హంటర్స్ టైక్వాండో అకాడమీలో శిక్షణ తీసుకున్న ఏడుగురు బంగారు పతకాలను, ఒకరు రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. వీరు చీరాల పరిసర ప్రాంతాల్లో వివిధ విద్యాసంస్థల్లో చదువుకుంటూ టైక్వాండోలో ప్రావీణ్యం సంపాదించి పతకాల పంట పండించారు. విజేతలను కోచ్ గూడూరి వరప్రసాద్ అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్