'ఎస్సీ ఎస్టీ సెల్ కు డీఎస్పీలను నియమించాలి'

64చూసినవారు
'ఎస్సీ ఎస్టీ సెల్ కు డీఎస్పీలను నియమించాలి'
రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కేసుల విచారణకు గతంలో మాదిరి ప్రతి జిల్లాలో ఇద్దరు డీఎస్పీలను నియమించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రరావు బాపట్ల ఎంపీ కృష్ణ ప్రసాదును కోరారు. శుక్రవారం నీలం నాగేంద్రరావు చీరాల ఐఎల్టిడి గెస్ట్ హౌస్ లో ఎంపీ కృష్ణప్రసాద్ ను కలిసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసులపై చర్చించారు. ఈ విషయాలన్నీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తానని ఎంపీ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్