రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుకగా ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు మధ్యంతర భృతి (ఇంటీరియo రిలీఫ్) ప్రకటించాలని ఎస్టియు బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. సోమవారం వేటపాలెం మండలంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులచే ఎస్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు వంకా ప్రభాకర్ రావు, చీరాల పట్టణ బాధ్యులు రమేష్, తదితరులు పాల్గొన్నారు.