న్యాయం కోసం లారీ యజమాని అవిశ్రాంత పోరాటం

68చూసినవారు
చీరాల పోలీసుల తీరుపై హరిప్రసాద్ నగర్ కు చెందిన లారీ యజమాని వల్లెపు బాలఅంకమ్మరావు శుక్రవారం టిడిపి కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ లో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రకు ఫిర్యాదు చేశారు. చీరాల లారీ యజమానుల సంఘం అవినీతి అక్రమాలపై తాను పోరాడుతున్న క్రమంలో తన ఇంట్లో నాలుగు సార్లు దొంగతనాలు జరిగినప్పటికీ పోలీసులు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని, విచారణ చేయడం లేదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్