వేటపాలెం పి. హెచ్. సి వైద్యాధికారిగా డాక్టర్ వై. స్వాతి కిరణ్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ పీహెచ్సీలో గొడవలు చోటు చేసుకున్న నేపథ్యంలో డ్యూటీ డాక్టర్ బాలరాజు, ఫార్మసిస్టు ప్రసాదరావు లను బదిలీ చేయడం తెలిసిందే. అయితే రోగులకు ఇబ్బంది కలగకుండా చీరాల పిపి యూనిట్ నుండి డాక్టర్ స్వాతి కిరణ్, డాక్టర్ సాయి వైష్ణవి, స్టాఫ్ నర్స్ కే. నాగమణి లను వేటపాలెం పీహెచ్‌సీ కి డిప్యూటేషన్ పై డి. ఎం. హెచ్. ఓ పంపారు.