వాలంటీర్లు అభద్రతాభావానికి లోను కావాల్సిన అవసరం లేదని, టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారిని కొనసాగించడమే కాకుండా నెలకు పదివేల రూపాయల వేతనం ఇస్తుందని చీరాల ఎన్డీఏ అభ్యర్థి కొండయ్య యాదవ్ భరోసా ఇచ్చారు. గురువారం చీరాలలో జరిగిన అనేక సభలలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఐదేళ్లు వాలంటీర్ల చేత ఊడిగం చేయించుకుందని విమర్శించారు. ఇందుకు భిన్నంగా టిడిపి వాలంటీర్ల వ్యవస్థను రూపుదిద్దుతుందన్నారు.