గుర్తుతెలియని మృతదేహం లభ్యం

50చూసినవారు
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనీ రాజావారి తోటలో ఉన్న బీసీ బాలికల హాస్టల్ సమీపంలో రోడ్డు పై సోమవారం సాయంత్రం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మృతుడి చేతిపై రాజేశ్వరి అనే పచ్చబొట్టు ఉన్నట్లుగా కొత్తపేట పోలీస్ స్టేషన్ సిఐ ఎం. వీరయ్య తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టు నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెల్సిన వాళ్ళు కొత్తపేట పోలీసులను సంప్రదించవలసిందిగా సిఐ కోరారు.

సంబంధిత పోస్ట్