కొల్లిపర మండల పరిధిలోనే మున్నంగి గ్రామంలో గురువారం శ్రీలక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపయ్య స్వాముల వారికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణ మహోత్సవాన్ని చూడడానికి గ్రామంలోని ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వారందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు.