మాచర్ల పట్టణంలో బుధవారం మధ్యాహ్న సమయంలో ఓ మోస్తారు వర్షం కురిసింది. వారం రోజులుగా ఎండ తీవ్రత పట్టణంలో ఎక్కువగా ఉండంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ క్రమంలో పట్టణంలో మోస్తారు వర్షం కురవడంతో పట్టణ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. అలాగే మండల పరిధిలోని పలు గ్రామాలలో వర్షాల కోసం రైతన్నలు ఎదురుచూస్తున్నారు. వేసిన పంటలు చేతికి రావాలంటే ఈ సమయంలో వర్షాలు ఎంతో అవసరమని పలువురు రైతులు అన్నారు.