త్వరలో కృష్ణా - గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని మంగళవారం కారంపూడి ఇన్ చార్జ్ తాహశీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్ సూచించారు. రేపటికి ఆఖరి తేదీ కావడంతో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కోరారు. గ్రామీణ స్థాయి నుంచి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.