మైనర్ బాలిక(15) పై అత్యాచారం చేసిన కీచక టీచర్ యద్దనపూడి శ్రీనివాసరావు యొక్క నకిలీ ఎస్టి కుల సర్టిఫికెట్ రద్దు చేయాలని ఎం సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పి. అబ్రహం లింకన్ కోరారు. సోమవారం మాచర్ల తాసిల్దార్ కార్యాలయం నందు స్పందన కార్యక్రమంలో బాధితులతో కలిసి వారు సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు. నిందితుని నకిలీ కుల సర్టిఫికెట్లను రద్దుచేసి, అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.