భారీ వర్షాల నేపథ్యంలో పట్టణంలోని ప్రతి వార్డులో పారిశుద్ధ్యానికి మొదటి ప్రాధాన్యమిస్తూ అన్ని ప్రాంతాలలో నీటి నిల్వలను తొలగించి కాల్వలు శుభ్రపరచనున్నట్లు మాచర్ల మున్సిపల్ కమిషనర్ డి. వేణుబాబు తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాల వలన ప్రజలకు ఇబ్బంది కలగకుండా లోతట్టు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశామని చెప్పారు.