చిన్నగంజాం మండలం చిన్నగంజాం కు చెందిన సుబ్రహ్మణ్యం ఇటీవల తన శిశువును అమ్ముకున్నాడని ఆరోపణలు రావడంతో శుక్రవారం జిల్లా బాలల సంరక్షణ అధికారి పురుషోత్తమరావు సిబ్బందితో కలిసి ఆయన ఇంటికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. శశివును అమ్ముకోవటం చట్టరీత్యా నేరమని ఆయన తెలియజేశారు. మరోసారి ఇలా చేయవద్దని సూచించారు.