ఉత్తమ సేవలకు గాను 368 మందికి ప్రశంసా పత్రాలు

74చూసినవారు
ఉత్తమ సేవలకు గాను 368 మందికి ప్రశంసా పత్రాలు
జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన జిల్లా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, వివిధ సంస్థల ప్రతినిధులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గురువారం ప్రశంసా పత్రాలను అందజేశారు. రెవెన్యూ శాఖలో 46 మంది, ఐసిడిఎస్ లో 14, వైద్య ఆరోగ్య శాఖలో 14, పోలీసు శాఖలో 27, సోషల్ వెల్ఫేర్ లో 25, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులో 11, జెడ్పీలో 11 మంది ఉద్యోగులు, సిబ్బంది ఈ ప్రశంస పత్రాలను అందుకున్నారు.

సంబంధిత పోస్ట్