నేను బడికి పోతా కార్యక్రమం విజయవంతం చేయాలి

61చూసినవారు
బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించేందుకు చేపట్టిన 'నేను బడికి పోతా' కార్యక్రమం విజయవంతం చేయాలని డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి వేణుగోపాలరావు శనివారం కోరారు. జులై 12 వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. డివిజన్లోని 14 మండలాల్లో ఉన్న బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వాన్ని నిబంధనల మేరకు విద్యార్థులకు కిట్లు పంపిణీ పూర్తి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్