పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదని గుంటూరు రేంజి ఐజి సర్వ శ్రేష్ట త్రిపాటికి నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు భరోసా ఇచ్చారు. శనివారం ఐజిని ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో సత్కరించారు. నియోజకవర్గంలో ఇకపై శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ ఒక్కరిని వదలొద్దని సూచించారు.