పెదకూరపాడు రైల్వేస్టేషన్లో మినరల్ వాటర్ ప్లాంట్ ను పెదకూరపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అర్థిమళ్ళ రమేష్ శనివారం ప్రారంభించారు. రమేష్ జన్మదిన సందర్భంగా శ్రీనివాసరావు( రైల్వే స్టేషన్ మాస్టర్) సొంత నిధులతో ప్రయాణికులకు శుద్ధ జలం అందించేందుకు మినరల్ వాటర్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు బెల్లంకొండ రాంగోపాల్ రావు, వడ్లమూడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.