తుంగభద్ర డ్రెనేజీలో పడి మహిళా మృతి
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం 7వ వార్డు డి వి సి కాలనీకి చెందిన మేకల సమాధానం ( 38) తుంగభద్ర డ్రెనేజీలో శనివారం శవమై తేలింది. శుక్రవారం రాత్రి నుంచి తన భార్య కనిపించక పోవడంతో భర్త మేకల తిమోతి చుట్టుపక్కల విచారించాడు. శనివారం స్థానికుల సమాచారం మేరకు డ్రెనేజీలో మృతదేహం ఉంది అని తెలియటంతో ఘటనా స్థలానికి చేరుకుని తన భార్యగా గుర్తించాడు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.