ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగిన సంఘటన చెరుకుపల్లిలో శనివారం చోటు చేసుకుంది. రేపల్లె డిపోకు చెందిన ఏపీ07 జెడ్ 0492 నెంబర్ గల ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు గుంటూరు నుండి రేపల్లె వెళ్తూ చెరుకుపల్లిలో ఆగింది. చెరుకుపల్లిలో ప్రయాణికులు కిందకు దిగే సమయంలో అకస్మాత్తుగా బస్సులో నుంచి దట్టమైన పొగతో పాటు మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మహిళలు కిటికీలో నుంచి బయటకు దూకడంతో పెను ప్రమాదం తప్పింది.