నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

70చూసినవారు
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
విద్యుత్తు లైన్ల మరమ్మతులు కారణంగా శనివారం రేపల్లె రూరల్ మండలంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాసరావు తెలిపారు. రేపల్లె మండలం గంగడిపాలెం 33 కెవి లైన్ ల మరమ్మత్తులు మరియు కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తున్నందున ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్