తెనాలి తహశీల్దార్ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను తహశీల్దార్ గోపాలకృష్ణ ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ , వారిని ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.