హెరిటేజ్ వారి ఆధ్వర్యంలో భట్టిప్రోలు మండల పరిధిలోని బొద్దులూరుపాడులో మంగళవారం హెచ్పిసి 2001 టెండర్ నందు పాడి రైతు అవగాహన సదస్సు జరిగినది. విజయవాడ ప్రాంతీయ అధికారి, నాగ అప్పారావు మాట్లాడుతూ పాడి పశువుల పెంపకంలో పాత సాంప్రదాయ పోషణ వలన నష్టాలు వచ్చుచున్నాయన్నారు. కొత్త సాంకేతిక విధానం పెంపొందించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. గేదెల పెంపకం కంటే ఆవులు పోషణలో అధిక ఆదాయం పొందగలరన్నారు.