నాటు సారా తయారు చేయటం, విక్రయించటం చట్టరీత్యా నేరమని అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఈపూరు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ డి. వెంకటేశ్వర్లు అన్నారు. ఈపూరు మండలంలోని అగ్నిగుండాల పరిసర ప్రాంతాల గ్రామాల యందు నిఘాలో భాగంగా సిబ్బందితో బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాటు సారాయి తయారు చేయటం విక్రయించటం చట్టారీత్యా నేరమన్నారు.