త్రిపురాంతకంలోని బాలత్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో ఉగాది మరియు వసంత నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు, కమిటీ చైర్మన్, ఈఓ, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.