TG: కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వందశాతం అబద్దమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మంగళవారం ప్రవేశపెట్టిన డేటాపై కాంగ్రెస్ పార్టీకి అసలు అవగాహన, స్పష్టత లేదని అన్నారు. కాంగ్రెస్‌కు 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేదని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా యూటర్న్ తీసుకుందని పేర్కొన్నారు. ఆ పార్టీ హామీలు, ప్రకటనలన్నీ రాజకీయ నాటకాలే అంటూ వ్యాఖ్యానించారు.