AP: చంద్రబాబు పాలనలో బీసీలకు పెద్దపీట వేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం పేర్కొన్నారు. బీసీల నామ సంవత్సరంగా 2025 కూటమి పాలన ఉంటుందని మంత్రి వ్యాఖ్యానించారు. బీసీల నిధులను కూడా దారిమళ్లించిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం ఏర్పాటు చేశారన్నారు. బీసీల సంక్షేమానికి రూ.39,007 కోట్లతో నిధుల కేటాయించారని మంత్రి తెలిపారు.