కూటమి ప్రభుత్వం రాకతో బీసీలకు పూర్వ వైభవం వచ్చిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. అన్ని సంక్షేమ పథకాల్లో బీసీలకు అగ్రపీఠం దక్కుతోందని చెప్పారు. వెనుకబడిన వర్గాల నేతల చేతుల్లో కీలక శాఖలు ఉన్నాయన్నారు. కులగణన ద్వారా ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. తిరుపతిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మగౌరవ సభలో సహచర మంత్రులు సత్యకుమార్, సవితతో కలిసి అనగాని పాల్గొన్నారు. మంత్రులను బీసీ నేతలు సత్కరించారు.