రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఈ చలిని తట్టుకోలేక అటవీ ప్రాంతంలో ఉండే మూగజీవాలు జనవాసాల్లోకి వస్తున్నాయి. తాజా ఐదు ఎలుగుబంట్లు నగర వీధుల్లోకి రావడం ప్రజల్లో భయాందోళనను పెంచుతోంది. అడవిలో ఆహారం దొరక్క అవన్నీ నగరాల బాట పట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.