నిమ్మరసంలో చక్కెర కలిపి ఎక్స్‌ఫోలియెంట్ స్క్రబ్ లాగా ఫేస్‌కి ఉపయోగించుకోవచ్చు. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు స్క్రబ్ చేస్తే చర్మ మృతకణాలు తొలగిపోయి, స్కిన్ గ్లో పెరుగుతుంది. లేదంటే నిమ్మరసంలో తేనె లేదా పెరుగు కలిపి మాస్క్‌లాగా వేసుకోవచ్చు. దీనిని ముఖానికి రాసుకుని 20 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే నిమ్మరసంలో రోజ్ వాటర్ లేదా కీరదోస రసం కలిపి టోనర్ లాగా ట్రై చేయవచ్చు.