72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు ఈ సంవత్సరం హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతున్నాయి. మే 10 నుంచి 31 వరకు సాగనున్న ఈ పోటీల్లో 115కి పైగా దేశాల నుంచి వచ్చిన అందాల భామలు పాల్గొంటున్నారు. ఈ రోజు గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ ఫైనల్‌లో కంటెస్టెంట్స్ పాల్గొని.. తమ శారీరక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే అక్కడ ఈ అందాల భామలు మన డీజే స్టెప్పులకు డ్యాన్స్ చేసి అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.