స్వాతంత్య్ర దినోత్సవం పంద్రాగస్టే ఎందుకంటే?

76చూసినవారు
స్వాతంత్య్ర దినోత్సవం పంద్రాగస్టే ఎందుకంటే?
ఆనాటి వైస్రాయ్ మౌంట్​బాటన్ కు ఆగస్టు 15 న ఓ సెంటిమెంటు ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో 1945 ఆగస్టు 15న జపాన్ లొంగిపోయింది. ఆ సమయంలో మిత్ర దేశాల దక్షిణాసియా కమాండ్​కు మౌంట్​బాటన్ నేతృత్వం వహించారు. ఆ సెంటిమెంట్ పంద్రాగస్టు వైపు మౌంట్​బాటన్​ను మొగ్గుచూపేలా చూసింది. "ఆగస్టు లేదా సెప్టెంబర్ కల్లా అప్పగిద్దామనుకున్నా. అనుకోకుండా ఆగస్టు 15 గుర్తుకొచ్చింది. ఎందుకంటే జపాన్ లొంగిపోయి అప్పటికి రెండు ఏళ్లు పూర్తి కానుంది" అని మౌంట్​బాటన్ 'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' పుస్తకంలో తెలిపారు.

సంబంధిత పోస్ట్