పాలివ్వడం వల్ల తల్లికి కలిగే ప్రయోజనాలు

51చూసినవారు
పాలివ్వడం వల్ల తల్లికి కలిగే ప్రయోజనాలు
శిశువుకు తల్లి తన స్తన్యం పంచడం ద్వారా ఆ శిశువుకు మాత్రమే కాకుండా, తల్లికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. బిడ్డకు ముర్రుపాలు పట్టడం వల్ల గర్భధారణ తర్వాత తల్లికి రక్తస్రావ ప్రమాదం తగ్గి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లో రొమ్ము, అండాశయ క్యాన్సర్లు, మధుమేహం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఊబకాయం నుంచి తప్పించుకోవచ్చు. గర్భదారణకు పూర్వం ఉండే బరువును మళ్లీ పొందవచ్చు.

సంబంధిత పోస్ట్