మరో రెండు వారాల్లో పారిస్ వేదికగా పారాఒలింపిక్స్ జరగనున్నాయి. ఆగస్ట్ 28 నుంచి ఈ గేమ్స్ ప్రారంభమవుతాయి. భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు పోటీపడనున్నారు. పారాఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారులుగా భాగ్యశ్రీ జాధవ్, సుమిత్ అంతిల్‌ను ఎంపిక చేస్తూ ఐవోఏ ప్రకటించింది. మహారాష్ట్రకు చెందిన భాగ్యశ్రీ షాట్‌ఫుట్ క్రీడాకారిణి. సుమిత్ అంతిల్ జావెలిన్‌త్రో స్టార్ ఆటగాడు.